శతచ్ఛంద గణాధిపమ్
శతచ్ఛంద గణాధిపమ్ అభినవశుకపండిత, సమన్వయ సార్వభౌమ, బ్రహ్మశ్రీ గౌరీభట్ల బాలముకుందశర్మ, గోలోకాశ్రమము, సిద్ధిపేట గారి నిత్యావధానములో శతఛందస్సులో గణపతి శతకము... 1) విళంబి-పుష్య-కృష్ణ"ఏకాదశి, గురువారము తేది 31-01-2019 ఛందము: కందము జైవిఘ్నేశ్వర భగవా నే విఘ్నములజ్ఞజనులనేమనకుండన్ గావంగా గతినీవే నోవిజ్ఞ గుణజ్ఞ యజ్ఞ! ఓం ప్రథమేశా! 2) ఛందము: పథ్యాకందము - కందమువలె.. 6వగణము నలము, 8వ గణము ఒక గురువు. సుముఖ శుభద వర జయగుణ సమహృద్గిరిజాకర కల జనితాశా క్రమ విఘ్నవినాశ గణప తివధానమునను నిలుపగ ధీ ప్రణతుల్ 3. ఛందము: చపలాకందము- కందము వలె, 4వ గణం జగణము శుభమస్తు పృచ్ఛకాళికి సభాస్య సవివర సమేత సజ్జనులకు మీ యభయముతో గణపతి, దే వ!భృత్యుఁగావుమవధాన వాగ్విధిని నతుల్ 4. ఛందము: విపులాకందము- కందమువలె, 3, 4 గణాలు అవిభక్త పదాలు శత పద్యాత్మక ముక్తక మతి సుందరము సరళము మాన్యకృతాంతః స్థితకమనీయ విభాస్వ న్మతులిల వ్రాయంగనెంౘనాదర సమమున్ 5) విళంబి-పుష్య-అమావాస్య, సోమవారము తేది 04-02-2109 ఛందము: *నాగరము* (భరవ) ప్రాస - యతి × శ్రీగణపేశ! వందనమ్ వాగమృతేశి! సన్ముదా ప్రాగవధాన సా